Breaking News

‘కంగన’కు చెంపదెబ్బ.. సంజయ్‌రౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Fri, 06/07/2024 - 15:57

ముంబై: బాలీవు‌డ్‌ నటి, బీజేపీఎంపీ కంగనా రనౌత్‌ను ‌మహిళా కానిస్టేబుల్‌ చెంపదెబ్బ కొట్టిన ఘటనపై శివసేన(ఉద్ధవ్‌) నేత సంజయ్‌రౌత్‌ స్పందించారు. ‘కొందరు ఓట్లు వేస్తారు. కొందరు చెంపదెబ్బలు కొడతారు. కంగనా విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆమెపై నాకు సానుభూతి ఉంది.

ఆమె ఇప్పుడు ఒక ఎంపీ. ఎంపీపై దాడి జరగకూడదు. ఆ సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ చెబుతున్నట్లు  ఆమె తల్లి గనుక రైతుల ధర్నాలో ఉంటే కోపం వస్తుంది.  రైతుల పోరాటానికి వ్యతిరేకంగా కంగన మాట్లాడింది. నాకు రైతుల పట్ల గౌరవం ఉంది’అని  సంజయ్‌రౌత్‌ అన్నారు.

ఛండీగఢ్‌ ఎయిర్‌పోర్టులో తనిఖీల సందర్భంగా కంగనా రనౌత్‌ను సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ చెంప మీద కొట్టడం సంచలనం రేపింది. కంగన రైతుల పోరాటానికి వ్యతిరేకంగా మాట్లాడినందునే తాను కొట్టినట్లు కానిస్టేబుల్‌  తెలిపింది. 

కాగా, గతంలో మహారాష్ట్రలో  శివసేన నేతృత్వంలో మహా వికాస్‌ అఘాడీ అధికారంలో ఉన్నప్పుడు కంగన శివసేనకు వ్యతిరేకంగా తరచూ సవాళ్లు విసురుతూ ఉండేది. ఒక దశలో ముంబైలోని కంగనా స్టూడియో భవనాన్ని మున్సిపల్‌ అధికారులు అక్రమ నిర్మాణమని పేర్కొంటూ కూల్చివేశారు. 

Videos

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

సభలో అందరిముందు జనసేన గాలి తీసిన బాబు..

Idupulapaya: YSR ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Photos

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)