Breaking News

గడ్కరీని ఓడించేందుకే వారు పనిచేశారు : రౌత్‌ సంచలన ఆరోపణలు

Published on Sun, 05/26/2024 - 18:34

ముంబై: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్‌పై శివసేన(ఉద్ధవ్‌) కీలక నేత, ఎంపీ సంజయ్‌రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని నాగ్‌పూర్‌లో ఓడించేందుకు షా, ఫడ్నవిస్‌లు పనిచేశారని రౌత్‌ ఆరోపించారు.

‘మోదీ, షా, ఫడ్నవిస్‌లు కలిసి గడ్కరీని ఓడించేందుకు గట్టిగా పనిచేశారు. అయితే గడ్కరీని ఓడించడం సాధ్యం కాదని గ్రహించిన తర్వాత ఫడ్నవిస్‌ ఆలస్యంగా నాగ్‌పూర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మాటలు నేను కాదు ఆర్‌ఎస్‌ఎస్‌ క్యాడరే బహిరంగంగా చెబుతోంది’ అని శివసేన(ఉద్ధవ్‌) అధికారిక పత్రిక సామ్నాలో రౌత్‌ కథనం రాశారు. 

మరోపక్క అజిత్‌ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ చెందిన క్యాండిడేట్లను ఓడించేందుకు సీఎం షిండే ఒక్కో నియోజకవర్గంలో రూ.25 కోట్ల నుంచి 30 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈసారి మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగిని మారుస్తారు’అని రౌత్‌ తన కథనంలో పేర్కొన్నారు. 

కాగా, రౌత్‌ రాసిన ఈ కథనంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ చంద్రశేఖర్‌ బవాంకులే ఫైర్‌ అయ్యారు. నిజానికి రౌత్‌ శివసేన అభ్యర్థుల గెలుపు కోసం కాకుండా ఎన్‌సీపీ(శరద్‌పవార్‌) అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారని  ఆరోపించారు. రౌత్‌కి దమ్ముంటే 2019లో సీఎం అవడానికి ఆయన చేసిన ప్రయత్నాలపై కథనం రాయాలని సవాల్‌ విసిరారు.    

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)