Breaking News

‘మహా’ పాలిటిక్స్‌లో ట్విస్ట్‌..!ఫడ్నవీస్‌పై రౌత్‌ ప్రశంసలు

Published on Fri, 01/03/2025 - 12:38

ముంబయి:అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు చల్లబడినట్లు కనిపిస్తోంది. ఓ వైపు నిట్టనిలువున చీలిపోయిన శరద్‌ పవార్‌ కుటుంబం మళ్లీ కలిసే అవకాశముందని ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఇండియా కూటమిలో భాగమైన శివసేన(ఉద్ధవ్‌)పార్టీ కీలక నేత సంజయ్‌ రౌత్‌ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై తాజాగా ప్రశంసలు కురిపించడం హాట్‌టాపిక్‌గా మారింది.

గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు కోసం ఫడ్నవిస్‌ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని రౌత్‌ అన్నారు. ఈ విషయమై రౌత్‌ శుక్రవారం(జనవరి3) మీడియాతో మాట్లాడారు.’గతంలో మేం ఫడ్నవీస్‌తో కలిసి పనిచేశాం. మా సంబంధాలు కొనసాగుతాయి. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి విషయంలో ఫడ్నవీస్‌ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి’అని రౌత్‌ ప్రశంసించారు. ఇటీవల కోట్ల రూపాయల రివార్డులన్న మావోయిస్టు అగ్రనేతలు స్వయంగా సీఎం ఫడ్నవిస్‌ ముందే లొంగిపోయిన విషయం తెలిసిందే. 

కాగా, గతేడాది నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన(ఉద్ధవ్‌)ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేయగా బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్‌పవార్‌)పార్టీలతో  కలిసి మహాయుతి కూటమిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించి ఫడ్నవీస్‌ సీఎం పదవి చేపట్టగా ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌లు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. ఇండియా కూటమిలో శివసేన(ఉద్ధవ్‌) పార్టీ కాంగ్రెస్‌, ఎన్సీపీ(శరద్‌పవార్‌) పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించడం గమనార్హం. 

ఇదీ చదవండి: చొరబాటుదారులకు బీఎస్‌ఎఫ్‌ దన్ను

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)