Breaking News

నా స్థానంలో పోటీ చేసేది ఎవరంటే?.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 10/03/2025 - 10:08

సాక్షి, సంగారెడ్డి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ దసరా ఉత్సవాల్లో టీపీసీసీ వర్కింగ్‌ ‍ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో తన భార్య నిర్మల బరిలో ఉంటారని తెలిపారు. తాను మరో పదేళ్ల తర్వాతే పోటీ చేస్తానంటూ చెప్పుకొచ్చారు.

గత ఏడాది దసరా వేడుకల్లో కూడా జగ్గారెడ్డి ఇదే విషయాన్ని బహిరంగంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. గత జూన్‌లో కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లు సీఎంగా రేవంత్‌ రెడ్డి ఉంటారు.. ఆయన దిగిపోయాక నేను సీఎం కావడానికి ప్రయత్నం చేస్తాను అంటూ కామెంట్స్‌ చేశారు.

బీజేపీ నుంచి సంగారెడ్డి మున్సిపాలిటీకి కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జగ్గారెడ్డి.. 2004లో టీఆర్ఎస్‌(బీఆర్‌ఎస్‌)లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో లోక్‌సభ ఉప ఎన్నికల కోసం మళ్లీ బీజేపీలో చేరి ఓడిపోయారు. 2015లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా  కొనసాగుతున్నారు.

కాగా, సంగారెడ్డి జిల్లా కేంద్రం దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జగ్గారెడి దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రతి ఏటా ఈ వేడుకలను తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. తాను మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఈ వేడుకలను స్వయంగా పర్యవేక్షిస్తారు. పండగను పురస్కరించుకుని పాత బస్టాండ్‌ రాంమందిర్‌ నుంచి శోభాయత్ర జరిగింది. అంబేద్కర్‌ స్టేడియంలో రావణ దహణ కార్యక్రమం నిర్వహించారు.

 


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)