Breaking News

మీరట్‌లో సమాజ్‌వాదీ అభ్యర్థి మార్పు?

Published on Thu, 04/04/2024 - 11:59

యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కొత్త నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలకు మీరట్ స్థానం నుంచి గతంలో ప్రకటించిన అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నదని సమాచారం. అతుల్ ప్రధాన్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ భార్య సునీతా వర్మను ఎస్పీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మీరట్ అభ్యర్థిని మార్చడంపై జరుతున్న చర్చల మధ్య అతుల్ ప్రధాన్ తన ట్విట్టర్‌లో ఖాతాలో ఇలా రాశారు. ‘పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్ణయం నాకు సమ్మతమే. త్వరలో పార్టీ నేతలతో కూర్చొని మాట్లాడతాను’ అని రాశారు. కాగా బుధవారం అతుల్ ప్రధాన్ నామినేషన్ దాఖలు చేయగానే మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ మద్దతుదారులు నిరసన గళం వినిపించారు. దీంతో అతుల్ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్‌ చేసి, మాజీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మ భార్య, మేయర్ సునీతా వర్మను మీరట్‌ అభ్యర్థిగా  ఎంపిక  చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారని కూడా అంటున్నారు.

2019లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి సునీతా వర్మ, ఆమె భర్త యోగేశ్ వర్మ బహిష్కరణకు గురయ్యారు. అనంతరం వారు 2021లో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. పార్టీ హైకమాండ్  తమ అభియాన్ని గౌరవించిందని, తన భార్య సునీతా వర్మను అభ్యర్థిగా  ఎంపికచేసిందని అంగీకరించిందన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)