Breaking News

ఇంటి అటక మీద దాక్కున్న మాజీ ఎంపీ.. ఆటకట్టించిన పోలీసులు

Published on Thu, 09/04/2025 - 21:30

లక్నో:నెల పాటు పరారీలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ కైష్ ఖాన్ ఎట్టకేలకు అరెస్ట్‌ అయ్యారు. దాదాపూ నెల రోజు పాటు పరారీలో ఉన్న ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌ ఎస్పీ అధ్యక్షుడు,మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ సన్నిహితుడు కైష్‌ఖాన్‌పై ఐదు కేసులు నమోదయ్యాయి. వాటిల్లో పురావస్తు శాఖకు చెందిన భూమిని అక్రమంగా ఆక్రమించారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.  

గతంలో అనేక వివాదాలకు కైష్‌ఖాన్‌ కేంద్ర బిందువుగా నిలిచారు. దీంతో చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు. నిబంధనల మేరకు.. కైష్‌ఖాన్‌ సొంత జిల్లాలో ఉండకూడు. అయినప్పటికీ పోలీసుల కళ్ళు గప్పి తన సొంత జిల్లాలో ఉంటున్నారు. ఈ క్రమంలో నెల రోజుల నుంచి కైష్‌ఖాన్‌ గురించి పోలీసులు అన్వేషిస్తున్నారు.

తాజాగా కైష్‌ఖాన్‌ ఆచూకీపై సమాచారం అందడంతో ఆయన ఇంట్లోనే పోలీసులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో అటకపై పరుపును అడ్డుగా పెట్టుకుని దాక్కున్న కైష్‌ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ ఘటనపై ప్రజలలో చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులు ఇలా పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)