Breaking News

హర్యానా ఎన్నికల్లో సమాజ్‌వాదీ ఒంటరి పోరు?

Published on Tue, 08/27/2024 - 08:43

యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ పార్టీని మరో ముందడుగు వేయించనున్నారు. పార్టీని ప్రాంతీయానికే పరిమితం చేయకుండా జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు అఖిలేష్‌ యాదవ్‌ సమాయత్తమవుతున్నారు.  

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, మధ్యప్రదేశ్‌లో మాదిరిగా హర్యానాలో కూడా ఒంటరిగా పోటీ చేయాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టి యూపీలో 37 సీట్లు గెలుచుకుంది. ఈ ఫలితాల అనంతరం పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పించేదిశగా కసరత్తు ప్రారంభించారు.

హర్యానాలోని 11 అసెంబ్లీ స్థానాల్లో అహిర్ ఓటర్లు నిర్ణయాత్మక స్థానంలో ఉన్నారు. ఎనిమిది నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గణనీయ సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. దీనికితోడు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది వలస ఓటర్లు ఉన్నారు. వీరిలో 12 లక్షల మంది ఓటర్లు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కావడం విశేషం. ఇవన్నీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలసివచ్చే అంశాలని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది.

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)