Breaking News

‘కాంగ్రెస్‌ మళ్లీ వస్తే మహిళలకు ఏటా రూ.15 వేలు’

Published on Sun, 11/12/2023 - 17:25

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తాజాగా హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ రెండోదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయనీ ప్రకటన చేశారు. 

రాష్ట్రంలో గృహిణులైన మహిళందరికీ సంవత్సరానికి రూ.12,000 ఇస్తామని ప్రతిపక్ష బీజేపీ ఇప్పటికే తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి కౌంటర్‌గా సీఎం భూపేష్‌ బఘేల్‌ రూ.15,000 ప్రకటించినట్లుగా భావిస్తున్నారు. 

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్.. దీపావళి పర్వదినం సందర్భంగా లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో మహిళా సాధికారత కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు రాయ్‌పూర్‌లో విలేకరులతో పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని మహిళలకు ‘ఛత్తీస్‌గఢ్ గృహలక్ష్మి యోజన’ కింద ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని బఘేల్‌ ప్రకటించారు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 20 స్థానాలకు తొలి దశ పోలింగ్ నవంబర్ 7న ముగిసింది. మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి