Breaking News

ShameOnNitish: మహిళల వస్త్రధారణ వ్యాఖ్యలపై దుమారం

Published on Sun, 01/19/2025 - 09:17

పాట్నా: మహిళల వస్త్రధారణపై బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను అధికారం చేపట్టిన 20ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని మహిళల వస్త్రధారణ మెరుగుపడిందంటూ వ్యాఖ్యానించారాయన. దీనిపై అన్నివైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.  

నితీష్‌ సర్కార్‌ ప్రస్తుతం రాష్ట్రమంతటా ‘ప్రగతి యాత్ర’ ( Pragati Yatra)ను నిర్వహిస్తుంది. బెగుసరాయ్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో నితీష్‌ కుమార్‌ మహిళల వస్త్రధారణపై కామెంట్లు చేశారు. అయితే.. ఆ వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఆర్‌జేడీ నేత,మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ఘాటుగా స్పందించారు. సీఎం నితీష్‌ కుమార్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ కాదని,  ఆ మాటలు ఆయన వికృత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి అని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.  

అయితే, సీఎం నితీష్‌ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఎక్స్‌లో "ShameOnNitish" వీడియో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో.. ‘అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.  బాగా మాట్లాడతారు. చక్కని దుస్తులు ధరిస్తారు. వారు ఇంతకు ముందు ఇంత మంచి బట్టలు ధరించడం మనం చూశామా?

అని ప్రశ్నిస్తూనే.. ‘ఇంతకు ముందు బీహార్ కుమార్తెలు మంచి దుస్తులు ధరించలేదని కాదు. వారు తమను తాము ఆత్మగౌరవం, స్వావలంబనతో కప్పుకున్నారు’ అంటూ సీఎం నితిష్‌ వ్యాఖ్యల్ని ఖండించారు.  సీఎంగారు.. మీరు మహిళల కోసం ఫ్యాషన్ డిజైనర్‌గా మారడానికి ప్రయత్నించవద్దు. మీ ఆలోచనలు వికృతంగా ఉన్నాయి. మీ ప్రకటన రాష్ట్ర మహిళల్ని అవమానించేలా ఉన్నాయని’ ధ్వజమెత్తారు. 

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)