Breaking News

ప్రధానిగా ఖర్గే పేరు.... ఇండియా కూటమిలో చీలిక? 

Published on Tue, 12/26/2023 - 15:45

ఢిల్లీ: ఇండియా కూటమి తరుపున పీఎం అభ్యర్థిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1977 నాటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి పేరును ఖరారు చేయకుండానే ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు.  2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇండియా కూటమి తరుపున ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశంపై శరద్ పవార్ స్పందించారు. 

'1977 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానిగా అయ్యారు. ప్రధాని అభ్యర్థి పేరును ముందే ప్రకటించకున్నా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ప్రజలు మార్పును కోరుకున్నారు. కొత్త వ్యక్తులు ప్రధానిగా అయ్యారు.' అని పవార్ అన్నారు. అయితే.. ఇండియా కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా కొన్ని పార్టీలు ఇప్పటికే సూచించాయి. 

శరద్ పవార్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దీదీ పేర్కొన్న ప్రధాని అభ్యర్థిపై కాంగ్రెస్‌ కూడా సంతోషంగా లేదని అన్నారు. ఇండియా కూటమిలో చీలిక స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.

ఇదీ చదవండి: హిందూయిజంపై ఎస్పీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)