Breaking News

షర్మిలా.. నిజాలు మాట్లాడడం నేర్చుకో 

Published on Fri, 02/23/2024 - 05:58

అల్లిపురం (విశాఖ దక్షిణ) :  వెంటిలేటర్‌ మీద ఉన్న కాంగ్రెస్‌ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్‌ పేరును ఆయన మరణం తరువాత ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి అవమానించిన కాంగ్రెస్‌ పార్టీలో చేరడమే కాకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించడమే కాకుండా ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా తయారుచేసిన కాంగ్రెస్, టీడీపీలతో జతకట్టి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. వాస్తవాలు మాట్లాడడం షర్మిల నేర్చుకోకపోతే రానున్న కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె హెచ్చరించారు. విశాఖలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.

పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడకు వచ్చి ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థను యావత్తు దేశమే పొగుడుతుంటే షర్మిల సచివాలయ వ్యవస్థపై బురదజల్లేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని.. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల మధ్య తేడా కూడా తెలియకుండా మాట్లాడడం ఆమె అవగాహనారాహిత్యమని వరుదు కళ్యాణి విమర్శించారు.   



ఎక్కువ ఉద్యోగాలిచ్చింది వైఎస్సార్‌సీపీ సర్కారే.. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో 2 లక్షల 14 వేల శాశ్వత ఉద్యోగాలు, 6 లక్షల 30 వేలకు పైగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పించామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా.. 2008లో డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఆగిన ఉద్యోగాలను కూడా తమ ప్రభుత్వంలో భర్తీ చేశామన్నారు.

యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమన్నారు. కనీస అవగాహనలేకుండా ఎవరో రాసిన స్క్రిప్ట్‌ చదువుతున్న షర్మిల తన సొంత కుటుంబాన్ని వేధించిన వారితోనే జతకట్టడానికి సిగ్గులేదా అని ఆమె ప్రశ్నించారు. 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)