Breaking News

నా భార్య పోటీ చేయదు: రవి రాణా

Published on Fri, 10/11/2024 - 18:13

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బద్నేరా నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తన సతీమణి, మాజీ ఎంపీ నవనీత్‌ రాణా పోటీ చేయబోరని అ‍న్నారు. ఆమెకు రాజ్యసభ సీటును కేటాయిస్తామని బీజేపీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. బీజేపీ హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నమని తెలిపారు. దీంతో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యాలు చర్చనీయాంశంగా మారాయి. 

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ మాజీ ఎంపీ నవనీత్ రాణా విధానసభ ఎన్నికల్లో పోటీ చేయబోరని భావిస్తున్నా. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఇతర పార్టీ నాయకులు  ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆమెను రాజ్యసభకు పంపిస్తామని అంటున్నారు. ఆమెకు సముచితమని బాధ్యతగా భావిస్తున్నా’’ అని అన్నారు.

ఇక.. అమరావతి నుంచి నవనీత్ రాణా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అమరావతి (ఎస్సీ) స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ వాంఖడే గెలుపొందారు. 2024లో పార్లమెంట్‌ ఎన్నికల ముందు ఆమె బీజేపీలో చేరిసిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవనీత్‌ రాణా అమరావతి సెగ్మెంట్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.

ఇక.. మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26తో ముగియనుంది. ఈ క్రమంలో వచ్చే నెల(నవంబర్‌)లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నవనీత్‌ రాణా మద్దతు ఇస్తుందని రవి రాణా అన్నారు.

చదవండి:  ఫైరింగ్‌ ప్రాక్టిస్‌లో విషాదం.. ఇద్దరి అగ్ని వీరుల మృతి

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)