Breaking News

మహారాష్ట్ర భావి ముఖ్యమంత్రి రష్మీ ఠాక్రే?

Published on Mon, 09/23/2024 - 06:50

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముంబైలోని మాతోశ్రీ (ఉద్ధవ్ ఠాక్రే నివాసం)లో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రికి సంబంధించి కొత్త పేరు వినిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆమె చిత్రంతో కూడి పెద్దపెద్ద బ్యానర్లు  ఏర్పాటు చేశారు. అయితే ఏమైందోఏమో వాటిని కొద్దిసేపటికే తొలగించారు.

బ్యానర్ల కలకలం
మాతోశ్రీలో రష్మీ ఠాక్రేను సీఎం చేయాలనే బ్యానర్‌ పెట్టడంతో రాష్ట్రంలో రాజకీయ కలకలం రేగింది. గంట వ్యవధిలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన యువ కార్యకర్తలు మాతోశ్రీలోని ఆ బ్యానర్లను తొలగించారు.

నేడు రష్మీ ఠాక్రే పుట్టినరోజు
ఇటీవలే మహారాష్ట్రలో మహిళా ముఖ్యమంత్రి అంశంపై చర్చ ప్రారంభమైంది. ఈరోజు (సోమవారం) రష్మీ ఠాక్రే పుట్టినరోజు. దీనిని దృష్టిలో ఉంచుకుని శివసేన యువసేన మాతోశ్రీ వెలుపల రష్మీ ఠాక్రే కాబోయే ముఖ్యమంత్రి అంటూ పోస్టర్లు ప్రదర్శించింది. ఈ పోస్టర్లు పెట్టిన కొద్దిసేపటికే పార్టీ అగ్రనేతలు హడావుడిగా వాటిని తొలగించారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రేను సీఎం చేయాలని పార్టీలో ఒక వర్గం భావిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు
మరికొద్ది నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మహావికాస్ అఘాడీ, మహాయుతి దళ్ నాయకులు తమ సత్తా చాటేలా ఇప్పటికే ఎన్నికల సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించడం మొదలుపెట్టారు.

ఇది కూడా చదవండి: ‘హంగ్‌’ రావొద్దనే... కాంగ్రెస్‌తో పొత్తుపై ఒమర్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)