నా బిడ్డది ముమ్మూటికీ రాజకీయ హత్యే: రషీద్‌ తల్లిదండ్రులు

Published on Mon, 07/22/2024 - 15:51

సాక్షి, పల్నాడు జిల్లా: ముమ్మాటికీ తన బిడ్డది రాజకీయ హత్యేనని రషీద్‌ తల్లిదండ్రులు ఆరోపించారు. రషీద్‌ను వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీఎస్‌ అంజనేయులే చంపించారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీలో యాక్టివ్‌గా పనిచేస్తున్నాడనే టీడీపీ నేతలు తన బిడ్డను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ హత్యపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్యాయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆమె కూడా ఓ మహిళే కదా.. తల్లి కడుపు కోత తెలియదా అని ప్రశ్నించారు. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారని నిలదీశారు.ప్రభుత్వం న్యాయం చేసేదే అయితే ఎందుకు తమ దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పలేదని రషీద్‌ తల్లిదండ్రులు ప్రశ్నించారు. 

కొంతమంది ఫోన్ చేసి తమ కుటుంబ సభ్యులను భయపెడుతున్నారని చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తమ ఇంటికి వచ్చి న్యాయం చేస్తానని చెప్పారని తెలిపారు. అసెంబ్లీలో రషీద్ హత్యపై వైఎస్‌ జగన్‌ పోరాడుతుంటే పోలీసులు ఎందుకు ప్లే కార్డులు లాక్కున్నారని ప్రశ్నించారు.

‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు మాట్లాడను ఇవ్వటం లేదు. ఒక మనిషిని అన్యాయంగా చంపితే ఆయన తరుపున మాట్లాడే హక్కు లేదా?. పార్టీ పరంగా అడిగే హక్కు వైఎస్ జగన్‌కు లేదా?. ఎందుకు ప్రభుత్వం, పోలీసులు పదేపదే నా బిడ్డది వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్యానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)