Breaking News

సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!

Published on Thu, 05/09/2024 - 08:35

2024 లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్ ముగిసింది. ఇంతలో బీహార్ రాజకీయాల్లో మరో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. లాలూ యాదవ్‌ను ఒకసారి ఓడించిన జేడీయూ అధినేత ఇప్పుడు ఆర్జేడీలో చేరబోతున్నారని సమాచారం. ఇది సీఎం నితీష్ కుమార్‌కు పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రబ్రీ దేవి నివాసంలో లాలూ సమక్షంలో రంజన్ ఆర్జేడీలో చేరనున్నారని తెలుస్తోంది.

లాలూ యాదవ్‌కు రంజన్ యాదవ్  అత్యంత సన్నిహితుడు. ఒకానొక సమయంలో రంజన్ యాదవ్ కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో లాలూకు అండగా ఉన్నారు. రంజన్ యాదవ్ రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. జనతాదళ్ అతనికి ఈ అవకాశాన్ని కల్పించింది. రంజన్ 1990 నుంచి 1996 వరకు ఆర్జేడీలో ఉన్నారు. ఆ తర్వాత ఆర్జేడీని వీడి జేడీయూలో చేరారు.

2009లో పాటలీపుత్ర పార్లమెంటరీ స్థానం నుండి లాలూ యాదవ్‌పై పోటీకి జేడీయూ రంజన్‌ను నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో రంజన్ యాదవ్‌ లాలూను ఓడించారు.  తరువాత రంజన్‌ బీజేపీలో చేరారు. దీనికి ముందు ఆయన రాష్ట్రీయ జనతాదళ్ (నేషనలిస్ట్) పేరుతో సొంత పార్టీని నెలకొల్పారు. ఇప్పుడు రంజన్ యాదవ్ మరోసారి బీహార్ రాజకీయాల్లో పునరాగమనం చేయనున్నారు. రంజన్ యాదవ్ రాకతో లాలూ పార్టీకి మరింత సత్తా వస్తుందని పలువురు భావిస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)