Breaking News

ఎన్నికల వేళ డేరా బాబాకు పెరోల్‌ ఆమోదం.. ఈసీకి కాంగ్రెస్‌ లేఖ

Published on Tue, 10/01/2024 - 17:42

చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలవేళ.. ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ (డేరా బాబా) పెట్టుకున్న పెరోల్‌ పిటిషన్‌ను ఎన్నికల సంఘం సోమవారం ఆమోదించింది. దీనిపై హర్యానా పీసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మంగళవారం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

హర్యానా ఎన్నికల సమయంలో జైలు నుంచి  డేరా బాబాను విడుదల చేయడం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొంది. అదేవిధంగా 2019లొ డేరా బాబా చేతిలో హత్యచేయబడిన జర్నలిస్ట్‌ కుమారుడు సైతం గుర్మీత్ సింగ్ పెరోల్‌ను వ్య‌తిరేకించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల సమయంలో డేరా బాబాను పెరోల్‌పై విడుదల చేయటం.. ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికలు, ఓటింగ్ హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది. ఆయన ముఖ్యంగా ఒక  పార్టీకి ప్రయోజనం చేకూర్చే సందేశాలను హర్యానా ప్రజలకు పంపటం ద్వారా ఓటింగ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంద‌’ని  అన్నారు.

 

డేరా బాబాకు పంజాబ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ప్రస్తుతం బీజేపీ పాలించే హర్యానాలో ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈసారి హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య రాహోరీగా పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబాను పెరోల్‌పై విడుదల చేయటాన్ని హర్యానా కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోంది.

ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం కేసులో దోషిగా తేల‌డంతో 2017లో జైలు పాలైన డేరా బాబా.. 2020లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా 40 రోజుల పాటు పెరోల్‌పై విడుదల కావటం గమనార్హం​. ఎన్నికల ముందే డేరా బాబాను ఇలా పెరోల్‌పై విడుదల చేయటంపై కాంగ్రెస్, ప్రజా సంఘాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇక.. అక్టోబర్‌ 5వ తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

చదవండి: MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)