Breaking News

పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి

Published on Sat, 05/04/2024 - 04:33

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలి ‘వరంగల్‌– ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేరును పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఖరారు చేశారు. సుమారు అరడజను మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వాన్ని ఆశించినా రాకేశ్‌రెడ్డికి అవకాశం దక్కింది. 

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన రాకేశ్‌రెడ్డి.. బెంగళూరు, అమెరికాలలో వివిధ కార్పోరేట్‌ సంస్థల్లో పనిచేశారు. 2013లో బీజేపీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించారు. కానీ కుదరకపోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అవకాశం దక్కింది.

పల్లా రాజీనామాతో ఉప ఎన్నిక
శాసన మండలి ‘వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. దీనికి ఈ నెల 9వ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఓ.నర్సింహారెడ్డి, డాక్టర్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, పల్లె రవికుమార్, సుందర్‌ రాజు తదితరులు ఎమ్మెల్సీ టికెట్‌ ఆశించినా.. రాకేశ్‌రెడ్డికి దక్కింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో 4.61 లక్షల మంది పట్టభద్రులు ఈ ఎన్నికలో ఓటేయనున్నారు.

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి