Breaking News

రాజసమంద్ బరిలో మేవార్‌ రాజ కుటుంబీకురాలు

Published on Mon, 03/25/2024 - 22:19

రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్‌లో బీజేపీ తన అభ్యర్థుల ఐదో జాబితాను ప్రకటించింది. ఇందులో రాజ‌స‌మంద్ సీటు గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మహిమా విశేష్వర్‌ సింగ్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో ఈ స్థానం నుంచి దియా కుమారి ఎంపీగా ఉన్నారు. 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఈ స్థానానికి సుదర్శన్‌ రావత్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది.

ఎవరీ మహిమా విశేష్వర్ సింగ్?
మేవార్‌ రాజు మహారాణా ప్రతాప్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవార్‌ సతీమణే ఈ మహిమా విశేష్వర్ సింగ్. మహిమా సింగ్ భర్త విశ్వరాజ్ సింగ్ మేవార్ నాథ్‌ద్వారా బీజేపీ ఎమ్మెల్యే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో  మహిమ తన భర్త విజయానికి విశేష కృషి చేశారు. రాజ్‌సమంద్ పార్లమెంటరీ సీటులో 2019లో జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారిని పోటీకి దింపిన బీజేపీ ఇప్పుడు మేవార్‌ రాజకుటుంబానికి మహిమా సింగ్‌ బరిలోకి దించింది.

జగదీశ్వరి ప్రసాద్ సింగ్ ఇంట్లో 1972 జూలై 22న జన్మించిన మహిమా సింగ్ మేవార్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పాఠశాల విద్యను అభ్యసించారు. తరువాత మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఉన్న సింధియా కన్యా విద్యాలయంలో చదివారు. కాలేజీ విద్యను ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో పూర్తి చేశారు. ఆమె మనస్తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)