తగ్గిన ఓటింగ్‌ శాతంతో బీజేపీకి దెబ్బ? రాజ్‌నాథ్‌ ఏమన్నారు?

Published on Tue, 05/28/2024 - 07:37

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆరు దశల ఓటింగ్‌ పూర్తయ్యింది. ఇంకా ఒక దశ మిగిలివుంది. అయితే 2019తో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గింది. ఇది బీజేపీకి దెబ్బ అనే వాదన వినిపిస్తోంది. ఈ విషయమై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక మీడియా సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓటింగ్‌ శాతం తక్కువగా ఉంటే అది బీజేపీకి ప్రతికూలమేమీ కాదని, ఓటింగ్ శాతం తగ్గడానికి  ఎండవేడిమి ప్రధాన కారణమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఇండియా కూటమి విశ్వసనీయతపై పలు సందేహాలు ఉన్నాయని, ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో చాలా జాప్యం జరిగిందన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలు విభిన్న అభిప్రాయాలు కలిగినవని అన్నారు. ఇందుకు పంజాబ్‌లోని రాజకీయ పరిస్థితులే ఉదాహరణ అన్నారు. ఇండియా కూటమి ప్రజలకు ఉమ్మడి సందేశాన్ని ఇవ్వలేకపోయిందని, అందుకే ఈ కూటమిపై ప్రజల్లో నమ్మకం లేదన్నారు. ఈ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని చాలామంది భావిస్తున్నారని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈసారి కూడా బీజేపీ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు.

ఓటింగ్ శాతం తక్కువగా ఉండటానికి  కారణం ఎండ వేడిమి అని అన్నారు. గత ఎన్నికల్లో  ఇంతటి వేడి లేదన్నారు. ఈసారి దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీకి సీట్లు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ హయాంలో 25 శాతం మంది దారిద్య్ర రేఖ నుంచి బయటపడ్డారని, దేశంలో నిరుద్యోగం గతంలో కన్నా తగ్గిందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)