Breaking News

రాజస్థాన్‌: ఎపుడూ డిపాజిట్‌ దక్కలే.. అయినా తగ్గేదేలే!

Published on Tue, 11/07/2023 - 15:27

Rajasthan Assembly Elections 2023: రాజస్థాన్‌ ఎన్నికల సందర్బంగా 78 ఏళ్ల  తీతర్‌ సింగ్‌ వార్తల్లో నిలిచారు.  వరుసగా 32వ సారి కూడా ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రడీ అయ్యారు. 1970 నుంచి గ్రామపంచాయతీ నుంచి లోక్‌సభ వరకు 31 ఎన్నికల్లో పోటీ చేసిన తీతర్ సింగ్ ప్రతిసారీ ఓటమిని చవిచూశారు. అయితే తగ్గేదెలే అంటూన్న తితార్‌  సింగ్‌  గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

రాజస్థాన్‌లోని గంగానగర్‌కు చెందిన 78 ఏళ్ల  తీతర్‌ సింగ్‌ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) దినసరి కూలీ. తాజా ఎన్నికల్లో వరుసగా స్వతంత్ర అభ్యర్థిగా  శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పోటీకి సై అన్న తీతర్‌ సింగ్‌ ఈ పోటీ వెనుక అసలు ఉద్దేశాన్ని కూడా  వెల్లడించారు.

రాష్ట్రంలోని 25ఎఫ్ గులాబేవాలా గ్రామంలో నివాసం ఉంటున్న సౌదాగర్ సింగ్ కుమారుడు తీతర్ సింగ్. చదవింది ఐదవ తరగతి. కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1985లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాననీ అన్ని ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ఆశ మాత్రం అలాగే ఉంది అంటారు తీతర్‌ సింగ్‌. ఎందుకంటే నాలుగు తరాలు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అటు పేదలకుగానీ ఇటు గ్రామాభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు.ఇప్పటికైనా పేద ప్రజలకు ప్రభుత్వభూమి, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

అంతేకాదు తానుఎమ్మెల్యేగా ఎన్నికైతే గ్రామంలోని రోడ్ల అభివృద్ధితో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు భూమిలేని పేద కూలీలకు భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతానని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయడానికి తన మేకలను, ఇంటిని అమ్ముకున్నారట. స్థానికుల నుంచి సేకరించిన కొద్దిపాటి విరాళాలతోనే పోటీకి దిగారు. స్నేహితులతో కలిసి డోర్ టు డోర్ కాన్వాసింగ్ చేయడం మరో ప్రత్యేకత. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాలనేది సింగ్‌ కల అట.  

వృద్ధాప్యం కారణంగా చదవడం, రాయడం మర్చిపోయినా సంతకం మాత్రం చేయగలరు. అయినా ఎన్నికల్లో పోటీ చేయడాన్ని మాత్రం వీడలేదు. అంతేకాదు  ప్రతీ ఎన్నికలోనూ అతనికి డిపాజిట్‌ కూడా దక్కలేదు.  2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 653 ఓట్లు, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 427, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు వచ్చాయట.  ఇక 2023  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సురేంద్ర పాల్ సింగ్, కాంగ్రెస్ నుంచి గుర్మీత్ సింగ్ కూనర్‌తో సింగ్ తలపడనున్నారు.

తీతర్‌ సింగ్‌కు భార్య గులాబ్ కౌర్‌, ఇక్బాల్ సింగ్ ,రిచ్‌పాల్ సింగ్  అనే ఇద్దరు కుమారులున్నారు. ఈసారి ఎన్నికల్లో భార్యా పిల్లలు తనకు మద్దతుగా నిలిచారని సింగ్  చెప్పారు. కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సదర్‌పుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇక్కడ నవంబర్ 25న  పోలింగ్‌, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)