Breaking News

సీఎం అశోక్ గహ్లోత్ గొప్ప మనసు

Published on Sat, 11/25/2023 - 10:31

జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ గొప్ప మనసు చాటుకున్నారు. తెల్లవారితే పోలింగ్ ఉన్నప్పటికీ.. అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ ఎమ్మెల్యేను అర్ధరాత్రి పరామర్శించారు. ఎన్నికల వేళ నిత్యం బిజీగా ఉన్నప్పటికీ రాత్రి 1 గంటల సమయంలో ఆస్పత్రికి వెళ్లి బీజేపీ ఎమ్మెల్యే బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే జిజి వ్యాస్ అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆమెకు ఎయిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. నేడు రాష్ట్రంలో పోలింగ్ జరగనున్నప్పటికీ ‍అర్ధరాత్రి సమయంలో సీఎం అశోక్ గహ్లోత్ అనారోగ్యం పాలైన జిజి వ్యాస్‌ను పరామర్శించారు. అర్ధరాత్రి 1 గంటలకు ఎయిమ్స్‌కు వెళ్లి జిజి వ్యాస్‌ను పలకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. గహ్లోత్‌ను రాజస్థాన్ వజ్రంగా పేర్కొన్నారు నెటిజన్లు. మూడోసారి రాష్ట్రంలో అపూర్వ విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

రాజస్తాన్‌ శాసనసభ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్‌ జరుగనుంది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. శ్రీగంగానగర్‌ జిల్లాలోని కరణ్‌పూర్‌ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గురీత్‌సింగ్‌ కూనార్‌ మరణించడంతో ఇక్కడ పోలింగ్‌ను వాయిదా వేశారు. రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఇదీ చదవండి: మరోసారి గెలుపు మాదే: సచిన్ పైలెట్

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)