Breaking News

రేపు రాహుల్‌ సుడిగాలి పర్యటన ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం 

Published on Thu, 11/16/2023 - 03:27

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈనెల 17న తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు మొత్తం ఐదు నియోజకవర్గాల్లో ఆయన రోడ్‌షోలు, పాదయాత్రలు చేపట్టనున్నారు. కార్నర్‌ మీటింగ్‌లలో ప్రసంగించనున్నారు. పినపాక, నర్సంపేట, వరంగల్‌ ఈస్ట్, వెస్ట్, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయనున్నట్టు గాందీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈనెల 17 నుంచి వరుసగా ఐదారు రోజుల పాటు రాహుల్‌ తెలంగాణలో పర్యటిస్తారని అనుకున్నప్పటికీ, ప్రస్తుతానికి శుక్రవారం ఒక్కరోజు షెడ్యూల్‌ మాత్రమే ఖరారైంది.  

రాహుల్‌ పర్యటన ఇలా...  
ఈనెల 17న ఉదయం 9:30 గంటల సమయంలో ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రా నున్న రాహుల్‌గాంధీ హెలికాప్టర్‌లో ఉద యం 11 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక చేరుకుంటారు. అక్కడ 12 గంటల వరకు రోడ్‌షో నిర్వహించి కార్న ర్‌ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నర్సంపేటకు చేరుకుంటారు.

మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించి రోడ్డు మార్గంలో వరంగల్‌ ఈస్ట్‌ నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడ నుంచి పాదయాత్ర ద్వారా వెస్ట్‌ నియోజకవర్గానికి చేరుకుని అక్కడ కార్నర్‌మీటింగ్‌లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో  సాయంత్రం 6:30 గంటలకు రాజేంద్రనగర్‌కు వస్తారు. అక్కడ సభలో పాల్గొన్న అనంతరం ఢిల్లీ వెళ్లనున్నట్టు గాం«దీభవన్‌ వర్గాలు తెలిపాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)