Breaking News

నెహ్రూ గొప్పదనం ఆయన పేరులో లేదు.. రాహుల్ గాంధీ

Published on Thu, 08/17/2023 - 21:27

న్యూడిల్లి: దేశ రాజధానిలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీని ప్రధానమంత్రి మెమోరియల్ మ్యూజియం లైబ్రరీగా పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో అగ్గి రాజేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మ్యూజియం పేరు మార్పుపై స్పందిస్తూ నెహ్రుగారి గుర్తింపు ఆయన పేరులో కాదు ఆయన పనిలో ఉందని అన్నారు. 

లేహ్ వెళ్లబోయే ముందు ఢిల్లీ ఎయిర్పోర్టులో మ్యూజియం పేరు మార్పుపై మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ నెహ్రూ గారు ఆయన చేసిన పనికి ప్రసిద్ధి చెందారు తప్ప ఆయన పేరు వలన కాదని అన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఇదే విషయంపై 'X' సోషల్ మీడియా వేదికగా రాస్తూ ప్రధాన మంత్రి ఎంత ప్రయత్నించినా స్వాతంత్రం సమయంలో నెహ్రూ సాధించిన ఘనతలను సాధించలేరని విమర్శలు చేశారు. 

జైరాం రమేష్ తన X ఖాతాలో రాస్తూ.. ఈరోజు నుంచి ఒక దిగ్గజ సంస్థకు కొత్త పేరొచ్చింది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ ఇకపై ప్రధానమంత్రి మెమోరియల్ మ్యూజియం లైబ్రరీగా పిలవబడుతుంది. అత్యధిక కాలం దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన నెహ్రూ ప్రస్తావన వచ్చేసరికి ప్రధానికి ఎందుకో అనేక భయాలతోపాటు అభద్రతాభావం పెరుగుతూ ఉంటుంది. ప్రధానిది ఒక్కటే అజెండా నెహ్రూ ప్రతిష్టను మసక బారేలా చేసి ఆయన ప్రతిష్టను దిగజార్చి ఆ మహానేత ప్రస్థానాన్ని తెరమరుగయ్యేలా చెయ్యడమేనని  రాశారు. 

జైరాం రమేష్ వ్యాఖ్యలకు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ, జైరాం రమేష్ ఆలోచనలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలకి చాలా వ్యత్యాసముంది. వాళ్ళ వరకు నెహ్రూ ఆయన కుటుంబం మాత్రమే పట్టింపు, కానీ ప్రధాని నరేంద్ర మోదీకి అలా కాదు.. అందుకే దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన అందరు ప్రధానమంత్రులకు ఆయన ఈ మ్యూజియంలో సమున్నత స్థానాన్ని కల్పించారన్నారు.    

ఇది కూడా చదవండి: వసుంధర రాజేకు షాకిచ్చిన బీజేపీ  

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు