Breaking News

న్యూ లుక్‌లో రాహుల్‌.. పీక్‌లో 20 ఏళ్ల పొలిటికల్‌ కెరియర్‌

Published on Wed, 06/26/2024 - 09:24

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా మారారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా  ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీల సమ్మతి మేరకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా  ఎన్నికయ్యారు.

ఈ బాధ్యతలు స్వీకరించి అనంతరం రాహుల్ గాంధీ  ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. అతని ఎక్స్‌ప్రెషన్స్‌లో ఆత్మవిశ్వాసం తొంగిచూస్తోంది. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీకి సంబంధించిన రెండు ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిలో తాను ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యానన్న ఆనందం, ఉత్సాహం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి  భాగస్వామ్య పార్టీల నేతలంతా హాజరయ్యారు. వారంతా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రకటించిన వెంటనే రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్‌ గాంధీ ముఖం వెలిగిపోయింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ ప్రకటనకు ముందు రాహుల్ సమావేశంలో నిశ్శబ్దంగా ఉంటూ అందరి మాటలు ఆలకిస్తూ కనిపించారు.

తనను ప్రతిపక్ష నేతగా ఎన్నిక చేసిన అనంతరం రాహుల్‌ ఆనందంతో తన గుండెపై చేయి వేసుకున్నారు. తరువాత చేతులు జోడించి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో 20 మంది నేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ 2004లో తొలిసారి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది తొలిసారిగా అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. నాటి నుంచి ఆయన ప్రతిపక్ష నేత పదవిని చేపట్టలేదు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)