Breaking News

నేడు రాయ్‌బరేలీ సీటుపై రాహుల్‌ కీలక ప్రకటన?

Published on Tue, 06/11/2024 - 08:14

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియా, సోదరి ప్రియాంకతో కలిసి నేడు (మంగళవారం) యూపీలోని రాయ్‌బరేలీకి వస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. దీనితోపాటు రాయ్‌బరేలీ సీటు విషయంలో తన నిర్ణయం వెలిబుచ్చనున్నారని సమాచారం.

గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీతో అనుబంధం ఉంది. అందుకే రాయ్‌బరేలీ ఎంపీగా రాహుల్‌గాంధీ కొనసాగుతారనే వాదన చాలాకాలంగా వినిపిస్తోంది. రాహుల్ రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వయనాడ్‌ స్థానం నుంచి కూడా విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. అందులో ఆరుగురు ఎంపీలుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు 6.36 శాతం నుంచి 9.46 శాతానికి పెరిగింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌, సహరాన్‌పూర్‌లలో కాంగ్రెస్‌ ఖాతా తెరిచింది.

రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీకి 66.17 శాతం ఓట్లు రాగా, 2019లో సోనియా గాంధీకి ఇదే సీటు నుంచి 55.80 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిని చవిచూశారు. అయితే ఈసారి గాంధీ కుటుంబానికి సన్నిహుతుడైన కిషోరి లాల్ శర్మ  54.99 శాతం ఓట్లు దక్కించుకున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్‌ రాయ్‌బరేలీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనిలో రాహుల్‌ తాను రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగుతాననే సందేశాన్ని ఇస్తారని పలువురు కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.

భూమా అతిథి గృహంలో జరిగే ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, అమేథీ ఎంపీ కేఎల్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్, ఇతర సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.  

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)