రాహుల్ గాంధీపై అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు

Published on Tue, 03/26/2024 - 11:25

ఇండియా కూటమి కలిసి ఉన్నట్లు మన కంటికి కనిపించదని కామెంట్ చేసిన అస్సాం సీఎం 'హిమంత బిస్వా శర్మ' (Himanta Biswa Sarma) మరో మారు రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భవిష్యత్తు అంధకారం అవుతుందని.. 2026 నాటికి ఈశాన్య రాష్ట్రాలలో పాత పార్టీ (కాంగ్రెస్) ఉండబోదని విలేకరుల సమావేశంలో హిమంత బిస్వా అన్నారు. గత ఒకటిన్నర నెలల్లో చాలామంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ వీడారు. ఇదే కాంగ్రెస్ క్షీణతకు ఉదాహరణ అని అన్నారు.

2026 నాటికి అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఉండదని నేను నమ్ముతున్నాను. 2024 లోక్‌సభ ఎన్నికల తరువాత కూడా కాంగ్రెస్ నుంచి చాలా మంది నాయకులు బీజేపీలో చేరే అవకాశం ఉందని ఆయన అన్నారు. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా 2025 ప్రథమార్థంలో బీజేపీలో చేరతారని శర్మ చెప్పారు.

నేను భూపేన్ కుమార్ బోరా కోసం రెండు సీట్లు సిద్ధం చేసాను. కాంగ్రెస్‌లోని తృణమూల్ సభ్యులందరూ మాతో చేరతారు. నేను సోనిత్‌పూర్ అభ్యర్థికి ఫోన్ చేస్తే.. తప్పకుండా బీజేపీలోకి చేరుతారు. కానీ అది వద్దు. ఇప్పుడు అస్సాం మన చేతుల్లో ఉంది. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటిది, అవసరమైనప్పుడు తీసుకోవచ్చని అన్నారు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)