Breaking News

తెలంగాణకు రాహుల్‌ గాంధీ.. బస్సు యాత్ర సాగేది ఇలా..

Published on Tue, 10/17/2023 - 19:30

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలోకి దిగబోతోంది. ఇందుకోసం బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. బస్సు యాత్రని ఆరంభించేందుకు జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు బుధవారం రాష్ట్రానికి రానున్నారు. మూడు రోజులపాటు.. 8 నియోజకవర్గాల్లో సాగే బస్సు యాత్రలో రాహుల్‌ గాంధీ పర్యటిస్తారు. ఈ యాత్రలో నిరుద్యోగులు , సింగరేణి కార్మికులు, పసుపు.. చెరుకు రైతుల, మహిళలతో భేటీ ఆయన అవుతారు.  

పూర్తి షెడ్యూల్‌.. 
►బుధవారం మధ్యాహ్నాంకల్లా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న రాహుల్‌, ప్రియాంక
►బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో  రామప్ప టెంపుల్‌కు ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు
►రామప్ప టెంపుల్లో అన్నాచెల్లెళ్ల ప్రత్యేక పూజలు
►సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించనున్న రాహుల్, ప్రియాంక
►రామప్ప గుడి నుంచి ములుగు చేరుకోనున్న కాంగ్రెస్ బస్సు యాత్ర
►ములుగులో బహిరంగ సభలో మహిళలతో రాహుల్  ,ప్రియాంకా ప్రత్యేక సమావేశం
►ములుగు సభ తరువాత తిరిగి ఢిల్లీ వెళ్లనున్న ప్రియాంకా గాంధీ
►ములుగు బహిరంగ సభ తర్వాత.. భూపాలపల్లి చేరుకొనున్న బస్సు యాత్ర
►భూపాలపల్లి లో నిరుద్యోగ యువతతో  కలిసి రాహుల్ ర్యాలీ
►రాత్రికి.. భూపాలపల్లి లోనే బస చేయనున్న రాహుల్ గాంధీ

19వ తేదీన భూపాలపల్లి నుంచి మంథనికి చేరుకోనున్న బస్సు యాత్ర
►మంథని లో పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ. వెంట పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతరులు
►మంథని నుంచి పెద్దపల్లి వెళ్లనున్న బస్సు యాత్ర
►పెద్దపల్లి నుంచి కరీంనగర్కు బస్సు యాత్ర
►కరీంనగర్లో రాహుల్ గాంధీ రాత్రి బస

20వ తేదీన కరీంనగర్ నుంచి బోధన్ ఆర్మూరు మీదుగా నిజామాబాద్‌కు కాంగ్రెస్ బస్సు యాత్ర
►బోధన్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్న రాహుల్ గాంధీ
►ఆర్మూరులో కాంగ్రెస్ బహిరంగ సభ
►పసుపు.. చెరుకు రైతులతో రాహుల్ ప్రత్యేక సమావేశం
►నిజామాబాద్ లో పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ
►20వ తేదీ సాయంత్రం తో ముగియనున్న  టీ కాంగ్రెస్ మొదటి విడత బస్సుయాత్ర

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)