రాహుల్‌ డీఎన్‌ఏపై కేరళ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

Published on Thu, 04/25/2024 - 17:05

కేరళలో ‘ఇండియా’ కూటమి సభ్యులైన కాంగ్రెస్, సీపీఎం మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత వేడెక్కింది. తాజాగా సీపీఎం మద్దుతు ఉన్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పీవీ అన్వర్.. రాహుల్ గాంధీ డీఎన్‌ఏను పరిశీలించాలి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

సోమవారం మలప్పురంలోని ఎడతనట్టుకరలో జరిగిన సీపీఎం ఎన్నికల ప్రచార సభలో అన్వర్ ప్రసంగిస్తూ, “రాహుల్‌కు గాంధీ పేరును వాడుకునే హక్కు లేదు. అత్యంత నీచ స్థాయికి దిగజారిపోయాడు. అతను నెహ్రూ కుటుంబంలోనే పుట్టారా? నాకు సందేహాలు ఉన్నాయి. అతని డీఎన్‌ఏను పరీక్షించాలి” అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై రాహుల్ చేసిన హేళనపై విమర్శలు చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అన్వర్ వ్యాఖ్యలను మంగళవారం సీఎం విజయన్ కూడా సమర్థించారు. రాహుల్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ఎదుటివారి నుంచి తగిన సమాధానం వస్తుందని గ్రహించాలని హితవు పలికారు. గత వారం కేరళలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ “ఇద్దరు ముఖ్యమంత్రులు జైలులో ఉన్నారు. కేరళ ముఖ్యమంత్రికి ఇలా జరగకపోతే ఎలా? నేను బీజేపీపై 24 గంటలూ విమర్శలు చేస్తులంటే కేరళ ముఖ్యమంత్రి మాత్రం నాపై 24 గంటలూ విమర్శలు  చేస్తున్నారు. ఇది కొంచెం అయోమయంగా ఉంది” అని వ్యాఖ్యానించారు. 

విజయన్ కుమార్తె వీణా ఐటీ సంస్థలో జరిగిన అక్రమ చెల్లింపుల కుంభకోణం, త్రిసూర్‌లోని సహకార బ్యాంకులో జరిగిన మరో కుంభకోణంపై కేంద్ర ఏజెన్సీల దర్యాప్తుల కారణంగానే సీఎం విజయన్ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి బదులిస్తూ “మీ నానమ్మ (ఇందిరా గాంధీ మమ్మల్ని ఒకటిన్నర సంవత్సరాలు (ఎమర్జెన్సీ సమయంలో) జైలులో పెట్టింది రాహుల్” అని సీఎం విజయన్‌ గుర్తు చేశారు.

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)