Breaking News

ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ విమర్శలు

Published on Tue, 01/16/2024 - 15:21

కాంగ్రెస్‌ అగ్రనేత, వయినాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ కొనసాగుతోంది. నాగాలాండ్‌ రాజధాని కోహిమాలో రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరే​ంద్ర మోదీపై రాహుల్‌ విమర్శలు గుప్పించారు. అయోధ్యలో జనవరి 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ కార్యక్రమమని దుయ్యబట్టారు.

బీజేపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌), బీజేపీ జనవరి 22న జరిపే రామ మందిర ప్రారంభోత్సం పూర్తిగా నరేంద్ర మోదీ రాజకీయ కార్యక్రమమని మండిపడ్డారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం కాబట్టి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రామ మందిర కార్యక్రమానికి హాజరు కావటం లేదని ప్రకటించినట్లు గుర్తుచేశారు. తమకు అన్ని మతాలపై విశ్వాసం ఉందని, అన్ని మతాలను అంతే సమానంగా ఆచరిస్తామని పేర్కొన్నారు.

హిందు మతాన్ని పాటిస్తూ ఉన్నత స్థానంలో మతాచార్యులు సైతం రామ మందిర ప్రారంభ ఉత్సవాన్ని ఒక రాజకీయ కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ పనిగట్టుకొని రాజకీయం కోసమే రామ మందిర ప్రారంభోత్సవం నిర్వహించటం సరికాదన్నారు. అటువంటి రాజకీయ ప్రారంభోత్సవానికి హాజరుకావద్దని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

చదవండి: ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా షర్మిల.. నియమించిన కాంగ్రెస్‌ హైకమాండ్‌

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)