Breaking News

అమేథీ నుంచి రాహుల్‌.. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక? నామినేషన్లకు సన్నాహాలు?

Published on Fri, 04/26/2024 - 11:02

దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలల్లో తమ నామినేషన్లు వేసేముందు వయనాడ్ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలు అయోధ్యలోని రామ్ లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. 

కాంగ్రెస్‌ వర్గాల నుంచి మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 26న కేరళలోని వయనాడ్‌కు పోలింగ్ పూర్తయిన తర్వాత గాంధీ కుటుంబం అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాలపై దృష్టి పెట్టనున్నదని సమాచారం. అమేథీలో రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీలో ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్‌ వేయనున్నారని, దీనికి ముందు వారు అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. వయనాడ్‌లో ఓటింగ్ ఏప్రిల్ 26న ముగియనుంది. అదే రోజున రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం అమేథీ, రాయ్‌బరేలీలలో పోటీ విషయమై ఏప్రిల్ 30లోపు కాంగ్రెస్‌ అధికారిక ప్రకటన చేయనున్నదని సమాచారం. ఈ స్థానాల అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ మౌనం వహిస్తూ వస్తోంది. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు.. అమేథీ, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న పక్షంలో మే  ఒకటి నుంచి మూడవ తేదీలోపు  నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. ఈ రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లకు మే 3 చివరి రోజు. మే 20న ఐదవ విడతలో ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.

రాహుల్‌, ప్రియాంకలు యూపీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కాంగ్రెస్‌ కమ్యూనికేషన్‌ సెల్‌ ఇన్‌చార్జి జైరాం రమేష్‌తో పాటు పలువురు నేతలు గతంలోనే సూచన ప్రాయంగా తెలియజేశారు. తాజాగా అమేథీలోని రాహుల్ నివసించే బంగ్లాను శుభ్రం చేసి, పెయింటింగ్ వేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో కనిపించాయి. ఈ నేపధ్యంలో రాహుల్‌ అమేథీ నుంచి, ప్రియాంక రాయ్‌బరేలీ నుంచి పోటీచేయవచ్చని స్పష్టమవుతోంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)