Breaking News

బీజేపీలోనే ఉంటా.. పోటీ చేసేది అక్కడి నుంచే: రఘునందన్‌

Published on Sat, 09/02/2023 - 19:02

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. ఇక, మరికొందరు నేతలు పార్టీ మారుతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు కూడా పార్టీ మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, రఘునందన్‌ ఈ వార్తలపై స్పందించారు. 

పార్టీ మార్పు వార్తపై తాజాగా రఘునందన్‌ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా రఘునందన్‌ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తాను పార్టీ మారడం లేదని.. వచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో  బీజేపీ నుంచే  పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ గత పదేళ్లలో గజ్వేల్‌లో ఏం అభివృద్ధి చేశారో చూద్దామని పిలుపునిస్తే ముందురోజే తమను అరెస్ట్ చేసి  బిచ్కుంద పోలీసు స్టేషన్ తీసుకెళ్లారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. కామారెడ్డి నుంచి  బస్సులు పెట్టుకుని గజ్వేల్ వస్తే భయం ఎందుకని ప్రశ్నించారు. 

ఇక, ఏదోఒక రోజు సమయం చూసుకుని, డేట్ చెప్పకుండా గజ్వేల్‌కు వస్తానని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. గజ్వేల్ బస్ స్టాండ్ ఎలావుందో.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎలా ఉన్నాయో చూస్తామన్నారు. ఎప్పుడూ బీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండదు. ఈ విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హాట్‌ కామెంట్స్‌ చేశారు.   

ఇది కూడా చదవండి: రేవంత్‌ Vs కవిత.. మాటల వార్‌తో దద్దరిల్లిన ట్విట్టర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)