Breaking News

వివాదంలో ఎమ్మెల్యే బాలకృష్ణ.. వసుంధరకు నిరసన సెగ!

Published on Sat, 07/26/2025 - 10:19

సాక్షి, చిలమత్తూరు: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరకు నిరసన సెగ తగిలింది. శుక్రవారం ఆమె మండలంలోని తమ్మినాయనపల్లి గ్రామ రహదారి నిర్మాణానికి  భూమి పూజ చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతుండగా.. కోడూరు పంచాయతీ పరిధిలోని మధురేపల్లి గ్రామస్తులు ఆమెను అడ్డుకున్నారు.

కేవలం భూమిపూజలేనా.. పనులు కూడా చేస్తారా అంటూ ప్రశ్నించారు. తమ గ్రామ రహదారి నిర్మాణం కోసం 2014  సంవత్సరంలో భూమి పూజ చేశారని, పదకొండేళ్లయినా ఇంత వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టలేదని వాపోయారు. రోడ్డు లేకపోవడంతో కోడూరు తోపులోని ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏడాదికోసారి నాయకులు రావడం, భూమి పూజ చేయడం, వెళ్లిపోవడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్డు సరిగా లేని కారణంగా వర్షాకాలం గ్రామం నుంచి రావాలంటే ఇబ్బందిగా మారిందన్నారు. అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారమన్నారు. వెంటనే    తమ గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. దీంతో వసుంధర స్పందిస్తూ విషయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 వివాదంలో బాలకృష్ణ..
మరోవైపు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరు వివాదంగా మారింది. హిందూపురంలో బాలకృష్ణ సతీమణి వసుంధర షాడో ఎమ్మెల్యేగా రంగంలోకి దిగడంపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వసుంధర హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం పట్ల స్థానికులు, పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమం బాలకృష్ణ సతీమణి వసుంధర నిర్వహించడం వివాదానికి దారి తీసింది. ఎమ్మెల్యే బాలకృష్ణ షూటింగుల్లో బిజీ బిజీగా ఉండటం.. అధికారిక కార్యక్రమాల్లో వసుంధర భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)