Breaking News

Karnataka assembly elections 2023: 40 శాతం కమీషన్లు కన్పించడం లేదా?

Published on Thu, 05/04/2023 - 05:56

సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో మూడున్నర సంవత్సరాలు క్రితం అడ్డదారిలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్లు వసూలు చేస్తోందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తుంటే ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు నోరు మెదపడం లేదని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ ప్రశ్నించారు. కర్ణాటకలో విజయపుర జిల్లాలోని ఇండి నియోజకవర్గంలో బుధవారం ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.

ప్రధాని మోదీ సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అని అందరూ కొనియాడుతూ ఉంటారని అలాంటప్పుడు ఆయనకు కర్ణాటకలో ప్రభుత్వం ఏం చేస్తోందో తెలీదా అని ఆమె ఎద్దేవా చేశారు. ప్రతీ పనికి 40% కమీషన్లు తీసుకుంటూ ఉంటే కర్ణాకటను అభివృద్ధికే నమూనాగా తీర్చిదిద్దుతానని ప్రధాని మోదీ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కాంట్రాక్టర్లు, రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పటికి బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతితో కంపెనీలు హైదరాబాద్, చైన్నై వైపు వెళుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.   ప్రజల ఓట్ల కోసం తాను రాలేదని, వారి భవిష్యత్, పిల్లల భవిష్యత్‌ కోసమే వచ్చానంటూ ప్రియాంక భావోద్వేగంతో మాట్లాడారు. 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)