అక్టోబర్‌ 2న ప్రశాంత్‌కిశోర్‌ కొత్త పార్టీ

Published on Sun, 07/28/2024 - 19:49

పట్నా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి అవతారమెత్తనున్నారు. బిహార్‌లో ఆయన ప్రారంభించిన జన్‌సురాజ్‌ అభియాన్‌ సంస్థ గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న రాజకీయ పార్టీగా మారనుంది. రాజకీయ పార్టీగా మారేముందు ప్రశాంత్‌కిశోర్‌ పెద్దఎత్తున కసరత్తు చేయనున్నారు.

అక్టోబర్‌ 2కు ముందు జన్‌సురాజ్‌ తమ నేతలతో ఎనిమిది రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించనుంది. ప్రశాంత్‌కిశోర్‌ పాదయాత్ర కోసం పనిచేసిన లక్షన్నర మంది కార్యకర్తలతో రాష్ట్రవ్యాప్త సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలన్నింటిలో పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలి.. విధి విధానాలు ఏంటి..పార్టీ ప్రాధాన్యాలేంటన్న విషయాలపై చర్చించి ఫైనల్‌ చేయనున్నారు.

జన్‌సురాజ్‌ పేరు మీద బిహార్‌లో ప్రశాంత్‌కిశోర్‌ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సభల్లో విద్య, వైద్యం, యువతకు ఉద్యోగ అవకాశాలపైనే ఎక్కువ ఫోకస్‌ చేసి ప్రసంగించారు. 

కాగా, ఇటీవల తమ కార్యకర్తలెవరూ జన్‌సురాజ్‌తో సంబంధాలు నెరపొద్దని బిహార్‌ ప్రతిపక్షపార్టీ ఆర్జేడీ ఒక అంతర్గత సర్కులర్‌ జారీ చేసింది. దీనిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ బిహార్‌లో అత్యంత బలమైన పార్టీ అని చెప్పుకునే ఆర్జేడీ తమను చూసి భయపడుతోందని జన్‌సురాజ్‌ఎద్దేవా చేసింది.  

Videos

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

పోలీసులు కొట్టడంతోనే నా భర్త మృతి? గోపి లాకప్ డెత్ పై సంచలన నిజాలు

దేవుడా..నా దొంగతనం సక్సెస్ కావాలి

విధుల్లో ఉన్న పోలీసుపై దాడి.. గోప్యంగా విషయం?

మాజీమంత్రి విడదల రజిని మానవత్వం.. గాయపడిన బాధితులకు తక్షణ సాయం

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)