Breaking News

నితీశ్‌, లాలూ పీడ వదిలించడమే ఎజెండా: ప్రశాంత్‌కిశోర్‌

Published on Sun, 08/04/2024 - 15:43

పట్నా: తాను ప్రారంభించబోయే రాజకీయ పార్టీ ప్రాథమిక  ఎజెండాను రాజకీయ వ్యూవహకర్త ప్రశాంత్‌కిశోర్‌ ఆదివారం(ఆగస్టు4) ప్రకటించారు. బిహార్‌ నుంచి యువత వలసలు ఆపడానికి, బిహార్‌ను నితీశ్‌, లాలూల నుంచి విముక్తి చేయడమే తన పార్టీ ప్రధాన ఎజెండా అని చెప్పారు. అక్టోబర్‌ 2న కోటి మంది బిహారీలు సమావేశమై తమ పిల్లల భవిష్యత్తును నిర్ణయించుకుంటారన్నారు.

‘అక్టోబర్‌ 2న ప్రశాంత్‌కిశోర్‌ పార్టీ ప్రారంభించడం లేదు. బిహార్‌ ప్రజలు కొత్త పార్టీ ప్రారంభించుకుంటున్నారు. నితీశ్‌కుమార్‌, లాలూ ప్రసాద్‌లను వదిలించుకుని తమ పిల్లల భవిష్యత్తును నిర్ణయించుకోబోతున్నారు. గతంలో నేను రాజకీయ పార్టీల గెలుపు కోసం పనిచేశాను.  ఇప్పుడు మాత్రం బిహార్‌ ప్రజలకు వ్యూహకర్తగా పనిచేయబోతున్నాను’అని చెప్పారు. 

కాగా,ప్రశాంత్‌కిశోర్ జన్‌సురాజ్‌ పేరుతో బిహార్‌లో పాదయాత్ర చేశారు. జనసురాజ్‌ను అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా రాజకీయ పార్టీగా ప్రకటించనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌సురాజ్‌ పోటీ చేయనుంది.  

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు