Breaking News

భాయ్‌ సాహెబ్‌ ప్రజల గోడు పట్టదా.. తేజస్వీపై ప్రశాంత్‌ కిషోర్‌ సెటైర్లు!

Published on Fri, 01/27/2023 - 11:36

బీహార్‌ రాజకీయాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌పై ప్రశాంత్‌ కిషోర్‌ మండిపడ్డారు. భాయ్‌ సాహెబ్‌కు ప్రజల గోడు వినే సమయం కూడా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌ వేదికగా ఓ వీడియోను షేర్‌ చేసి నితీశ్‌ కుమార్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. బీహార్‌లోని రాఘోపూర్‌ ప్రజలు తమ ప్రాంతానికి రోడ్డు నిర్మాణం చేయాలని నిరసనలకు దిగారు. తమ నివాస ప్రాంతాల నుంచి ప్రధాన రహదారి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. కాగా, తమ గ్రామం మీదుగా డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ వెళ్తున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు తమ గోడు తెలిపేందుకు రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో తేజస్వీ కాన్వాయ్‌కి లైన్‌ క్లియర్‌ చేసే క్రమంలో పోలీసులు అ‍త్యుత్సాహం ప్రదర్శించారు. 

రోడ్డుపై నిరసనలు తెలుపుతున్న గ్రామస్తులను బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దీంతో, తేజస్వీ యాదవ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో తన వాహనాన్ని ఆపిన తేజ్వసీ.. వారితో కొద్దిసేపు మాట్లాడారు. కానీ, రోడ్డు నిర్మాణం గురించి ఎలాంటి హామీ ఇవ్వకుండానే వెళ్లిపోయారు అంటూ ప్రశాంత్‌ కిషోర్‌ కామెంట్స్‌ చేశారు. మరోవైపు.. గ్రామస్తుల నిరసనలపై ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు నిర్మాణం కోసం రాఘోపూర్‌ ప్రజలు గత 30 ఏళ్లుగా పోరాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వారికి రోడ్డు సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

ఈ సందర్బంగా స్థానికులు మీడియాతో మాట్లాడుతూ.. మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో పిల్లలు స్కూల్స్‌కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురద, వరద నీరు నిండిన రోడ్డు మీదుగా బడికి వెళ్లాల్సి వస్తోందన్నారుఉ. రోడ్డు విషయంపై మేమంతా స్థానిక నేతలకు ఎన్నో సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాము. కానీ, ఫలితం మాత్రం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)