Breaking News

కేజ్రీవాల్‌ ఓటమికి అదే ముఖ్య కారణం: ప్రశాంత్‌ కిషోర్‌

Published on Mon, 02/10/2025 - 07:27

పాట్నా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌, కేజ్రీవాల్‌ ఓటమిపై జన్ సూరజ్ పార్టీ చీఫ్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం పాలసీ కేసులో బెయిల్ పొందిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆయన చేసిన పెద్ద తప్పిదం అని చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్‌ రాజీనామా పార్టీకి తీవ్ర నష్టం కలిగించిందని వ్యాఖ్యలు చేశారు.

జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్‌ కిషోర్‌ తాజాగా ఓ కార్య​‍క్రమంలో మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఓటమికి పది సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకతనే మొదటి కారణం. అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా రెండో కారణం. మద్యం పాలసీ కేసులో అరెస్టు అయినప్పుడు ఆయన పదవి నుంచి తప్పుకోవాలి. అయితే, బెయిల్ పొందిన తర్వాత రాజీనామా చేయడం, ఎన్నికలకు ముందు మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించడం పెద్ద వ్యూహాత్మక తప్పిదమే అయ్యింది.

అలాగే, ఇటీవలి కాలంలో కేజ్రీవాల్‌ రాజకీయ వైఖరి కూడా మారింది. ఇండియా కూటమిపై ఆయన నిర్ణయాలు కొంత దెబ్బతిశాయి. ఇదే సమయంలో ఢిల్లీ ఎన్నికల్లో కూటమితో కాకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది ఆప్‌ పనితీరుపై ప్రభావం చూపించింది. కేజ్రీవాల్‌ పరిపాలనలోని లోపాలను ప్రజలు ఎత్తి చూపించినా ఆప్‌ సర్కార్‌ పట్టించుకోలేదు. ఢిల్లీలో ఆప్ రాజకీయ ఆధిపత్యాన్ని తిరిగి పొందడం కష్టమే. ఇక, ఎంతో కష్టపడితే కానీ, కేజ్రీవాల్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరింది. ఎన్నికల్లో 70 అసెంబ్లీ సీట్లలో 48 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్‌ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఇక, ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. వరుసగా మూడోసారి ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)