Breaking News

'కాళేశ్వరం అవినీతిపై యాక్షన్ ఎప్పుడో ప్రారంభమైంది..'

Published on Mon, 08/21/2023 - 13:50

హైదరాబాద్‌: కాళేశ్వరం అవినీతి మీద యాక్షన్ ఎప్పుడో ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవదేకర్ అన్నారు. తొందరలోనే బీజేపీ అభ్యర్థుల లిస్టు వస్తుందని చెప్పారు. తమ పార్టీలోకి వచ్చే వాళ్ళే తప్ప.. వెళ్ళే వారు లేరని అన్నారు. బీజేపీలో చేరేవారిని ఈ నెల 27న అందరూ చూస్తారని పేర్కొన్నారు. నేటి ప్రెస్ మీట్ ట్రైలర్ మాత్రమే.. మూవీ త్వరలో చూపిస్తామని అన్నారు.  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవదేకర్ మాట్లాడారు. 

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కిన కేసీఆర్..  9 ఏళ్లలో టీచర్, యూనివర్శిటీల్లో రిక్రూట్మెంట్ చేయలేదని మండిపడ్డారు. ఇచ్చిన నోటిఫికేషన్ లోనూ పేపర్ లీకేజీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. కేసిఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత , సంతోష్, హరీష్ రావు లకు మాత్రమే ఎంప్లాయిమెంట్ దొరికిందని అన్నారు. 

కేసిఆర్ పర్యటన ఉన్న ప్రాంతాల్లో ప్రతిపక్షాల ముందస్తు అరెస్టు చేస్తున్నారని ప్రకాష్ జవదేకర్ దుయ్యబట్టారు. మాజీ మంత్రి, మహిళ అని చూడకుండా డీకే అరుణను అడ్డుకుని అరెస్ట్ చేయడం ఎంటని మండిపడ్డారు. తాము తెలంగాణ ప్రజల కోసం పోరాడతామని అన్నారు. బీజేపీకి భయపడే తమ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గణ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి: Hanumanth Rao Warns Harish Rao: సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా... మైనంపల్లి హనుమంత రావు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)