Breaking News

అమేథీ కాంగ్రెస్‌ అభ్యర్థి రాబర్ట్ వాద్రా?

Published on Thu, 04/25/2024 - 16:55

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్‌ వీడలేదు. మే 20న ఐదవ దశలో అమేథీ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్‌ ఇక్కడి అభ్యర్థి ఎవరనేది వెల్లడించకముందే స్థానికంగా వెలసిన పోస్టర్లు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనేది తెలియజేస్తున్నాయి.  

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. అమేథీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ‘అమేథీ ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రాను ఆహ్వానించాలి’ అని పోస్టర్‌పై రాశారు. 

రాబర్ట్ వాద్రా అమేథీ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. అమేథీ, గౌరీగంజ్‌లలోని కాంగ్రెస్ కార్యాలయాలు, హనుమాన్ తిరహా, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ తరహా పోస్టర్లను గోడలపై అతికించారు. 

ఈ పోస్టర్ గురించి స్థానిక కాంగ్రెస్ నేత సోను సింగ్ రఘువంశీ మాట్లాడుతూ రాబర్ట్ వాద్రా ఈసారి అమేథీ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారు. అందుకే రాబర్ట్‌ వాద్రా ఇక్కడి నుంచి పోటీచేయాలని స్థానిక కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారన్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)