Breaking News

తెలంగాణలో కుల గణనపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Published on Wed, 10/30/2024 - 12:38

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో తొలి సారి సమగ్ర కుల సర్వే జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నెల 6 నుంచి కుల గణన చేపట్టనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో సమగ్ర సర్వే సరిగ్గా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి సూచన ప్రకారం త్వరలోనే అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు.. సర్వేలో పాల్గొనే అధికారులకు సహకరించాలని మంత్రి పొన్నం సూచించారు. పార్టీ పరంగా కూడా బాధ్యులను వేస్తామని, అధికారులకు ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.

కుల గణన చేయాలని ప్రభుత్వం  చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా బీఆర్ఎస్ నేతలు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఏ కార్యక్రమం చేసినా విమర్శలు చేయడమే పనిగా ప్రతిపక్షం పెట్టుకుందని విమర్శించారు. ‘50 శాతం పైబడిన బీసీ వర్గాలకు మేలు జరుగబోతోంది. దీనిని అయిన మెచ్చుకుంటారు అనుకున్నాం.  

దీపావళికి దావత్ చేసుకుంటే తప్పేంది అంటున్నారు. మీరు అప్పులు చేస్తే మేము వడ్డీలు కడుతున్నాం. చెప్పని కార్యక్రమాలు చేస్తున్నాం. డీఎస్సీ నిర్వహించాం. వెనుకబడిన కులాల మీద బీఆర్ఎస్‌కు  ప్రేమ లేదు. పార్టీ అధ్యక్షుడు, ఫ్లోర్ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు మీరే ఉన్నారు.  మా పీసీసీ చీఫ్ బలహీన వర్గాల నేత. కేిసీఆర్ ఫాం హౌస్ నుంచి ప్రెస్ నోట్ అయిన విడుదల చేయాలి. లేదంటే మీ పార్టీ కనుమరుగు అవుతుంది’ అని తెలిపారు.

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)