Breaking News

అప్పుడు కలెక్షన్‌ కౌంటర్లు..ఇప్పుడు కాల్‌సెంటర్లా?

Published on Tue, 08/13/2024 - 04:33

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు ఉన్నప్పుడు అరకొరగా రైతు రుణమాఫీ అమలు చేశారని, దీంతో అర్హులైన 3లక్షల మందికి మాఫీ కాలేదని, సాంకేతిక కారణాలతో ఆ రైతులకు అన్యాయం చేశారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆ రైతులకు కూడా త్వరలోనే మాఫీ చేస్తామని స్వయంగా అప్పటి మంత్రి హరీశ్‌ ప్రకటన విడుదల చేశారే తప్ప...ఆ రైతులకు మాఫీ కాలేదని వెల్లడించారు. 

రుణమాఫీ కాకపోవడంతో వేలాదిమంది రైతులను బ్లాక్‌లిస్టులో పెట్టి బ్యాంకులు కొత్త రుణాలు నిరాకరించినప్పుడు హరీశ్‌రావు ఏ కలుగులో దాక్కున్నారని సోమవారం ఒక ప్రకటనలో మంత్రి పొన్నం ప్రశ్నించారు. అప్పుడే హరీశ్‌రావు కాల్‌సెంటర్‌ పెట్టుకొని ఉంటే బాగుండేదన్నారు. అప్పుడేమో కలెక్షన్‌ కౌంటర్లు పెట్టి... ఇప్పుడు కాల్‌సెంటర్లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ కచ్చితంగా అమలు చేస్తుందని, సాంకేతిక కారణాలతో మాఫీ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. 

రుణమాఫీ అందని రైతులకు లేని తొందర హరీశ్‌రావుకు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. పదేళ్లలో ఆరులక్షల కోట్లు అప్పులు చేస్తే..వడ్డీలు కడుతున్నామని, కాలమైతే మీ ఖాతాలో, కరువొస్తే పక్కోళ్ల ఖాతాలో వేసే నైజం బీఆర్‌ఎస్‌ నేతలదని విమర్శించారు. అప్పులకు బాధ్యత వహించని బీఆర్‌ఎస్‌ అభివృద్ధిని తన ఖాతాలో ఎలా వేసుకుంటుందని ప్రశ్నించారు. పలుశాఖల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు కాల్‌సెంటర్ల పేరుతో ఇప్పుడు కహానీలు చెబుతున్నారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పినా వారికి అహంకారం మాత్రం తగ్గడం లేదని ఆ ప్రకటనలో పొన్నం పేర్కొన్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)