Breaking News

పొంగులేటి దారెటు.. రేపు ముఖ్య నేతలతో కీలక భేటీ

Published on Thu, 06/08/2023 - 15:31

సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరోసారి పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే అంశం మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో పొంగులేటి రేపు(శుక్రవారం) ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. దీంతో, ఆయన నిర్ణయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. 

అయితే, పొంగులేటి రేపు ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో కీలక నేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీకి ఉభయ జిలాల్లోని మండలానికి ఐదుగురు చొప్పున ముఖ్య నాయకులకు పొంగులేటి నుంచి పిలుపు అందినట్టు సమాచారం. నియోజక వర్గానికి 30 నుంచి 50 మంది చొప్పున నాయకులకు సమావేశానికి రావాలని పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ మార్పుపై ముఖ్య నాయకులకు తెలుపనున్నట్టు సమాచారం. కాగా, రేపటి సమావేశంలో పార్టీ మార్పుపై పొంగులేటి కీలక నిర్ణయం ప్రకటించనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. 

ఇదిలా ఉండగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పార్టీ మార్పుపై రోజుకో ప్రచారం జరుగుతున్నది. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం తథ్యమని విస్తృత ప్రచారం జరుగుతున్నది. ఇదే సమయంలో హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. పొంగులేటితో భేటీ అయ్యారనే వార్తలు బయటకు వచ్చాయి. దీంతో, బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జోరందుకుంది. 

ఇది కూడా చదవండి: తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఎమోషనల్‌ ట్వీట్‌


 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)