Breaking News

నేను సీట్ల ఒప్పందంతో కాంగ్రెస్‌లో చేరడం లేదు: పొంగులేటి

Published on Thu, 06/22/2023 - 12:53

సాక్షి, నల్లగొండ: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎండదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వడదెబ్బతో ఆయనకు జ్వరం, తలనొప్పి, నీరసం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో, భటి పాదయాత్రకు బ్రేక్‌ పడింది. కాగా, వైద్యుల సూచనల అనంతరం భట్టి పాదయాత్ర ప్రారంభించనున్నారు. 

ఇదిలా ఉండగా.. అనారోగ్యానికి గురైన భట్టి విక్రమార్కను కేతేపల్లిలో పొంగులేటి శ్రీనివాస్‌ కలిశారు. ఈ క్రమంలో భట్టిని పరామర్శించారు. అనంతరం, పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. వేసవి ఎండను కూడా లెక్కచేయకుండా భట్టి విక్రమార్క వంద రోజలు పాదయాత్ర చేశారు. అన్ని కులాలు, మతాల వారిని కలుస్తూ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. భట్టిని పరామర్శించడానికే ఇక్కడికి వచ్చాను. 

సీఎం కేసీఆర్‌ మాయమాటలతో తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా కేసీఆర్‌ నెరవేర్చలేదు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేయడం అభినందనీయం. తెలంగాణ ప్రజలు కన్న కలలు.. కాంగ్రెస్‌తోనే సాధ్యం. రాష్ట్రంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం చేస్తున్నారు. అమరుల కుటుంబానికి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా?. తెలంగాణ బిడ్డలు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను క్షమించరు. నేను సీట్ల ఒప్పందంతో కాంగ్రెస్‌లోకి రావడం లేదు అని స్పష్టం చేశారు. 

ఈ క్రమంలోనే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దోపిడీకి గురవుతోంది. తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. పొంగులేటిని కాంగ్రెస్‌లోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. పొంగులేటి చేరిక సభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారిద్దరూ హ్యాండ్‌ ఇవ్వనున్నారా?

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)