Breaking News

సీట్ల సర్దుబాటుతోనే రాజకీయ ఐక్యత 

Published on Wed, 04/05/2023 - 03:37

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని సీపీఎం, సీపీఐ భావిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతామని, తమ బలాన్ని పెంచుకుంటామని చెప్పా రు. బీజేపీ తప్పుడు పద్ధతుల్లో రాష్ట్రంలో ఎదిగేందుకు, అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

వామపక్ష భావజాలం బలంగా ఉన్న, సాయుధ పోరాటం జరిగిన తెలంగాణలో బీజేపీ అడుగుపెట్టాలనుకోవడం దుస్సాహసమేనని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఐకమత్యంతో వ్యవహరించాలని, రాబో యే ఎన్నికల్లో  వీలైతే బీఆర్‌ఎస్‌తో సీట్ల సర్దుబాటు పొత్తు కుదుర్చుకుంటామని చెప్పారు. 2024 ఎన్నికల్లో పొరపాటున బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం విచ్చి న్నంకాక తప్పదన్నారు.  

బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే క్రమంలోనే తెలంగాణలో తాము ఏకమయ్యామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆ రెండు పార్టీ ల నేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, చెరుపల్లి సీతారాములు, జాన్‌వెస్లీ సమావేశమయ్యారు. అనంతరం తమ్మినేని, కూనంనేని మీడియాతో మాట్లాడారు.  

షర్మిల తీరు హాస్యాస్పదం: కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో భాగస్వామి అయితే ఆమెను విచారించడాన్ని, శిక్ష విధించడాన్ని తమ పార్టీ లు సమర్థిస్తాయని తమ్మినేని అన్నారు. అయితే కవితపై పెడుతున్న కేసులు ప్రతిపక్షాలను లొంగ తీసుకునేందుకు ఆడుతున్న నాటకాలు తప్ప వాటిల్లో వాస్తవం లేదన్నారు. అదానీ దోపిడీకి వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, పోరాటాలు చేయాలని షర్మిలకు ఎందుకు గుర్తు రాలేదని తమ్మినేని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకతీతంగా విపక్షాలు కలిసి మాట్లాడుకోవాలనడం హాస్యాస్పదమని విమర్శించారు.  

మంచైనా, చెడైనా కలిసే ముందుకు..
తాము అన్నదమ్ముల్లా ఉన్నామని, మంచైనా, చెడైనా ఇక కలిసే ముందుకు నడుస్తామని కూనంనేని స్పష్టం చేశారు. తమ రెండు పార్టీలు కలిస్తే 40 నుంచి 50 నియోజకవర్గాల్లో అభ్యర్థి  ని గెలిపించే, ఓడించే శక్తి ఉంటుందని అన్నారు.  ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల మధ్య మరింత ఐక్యత దిశగా ఈ నెల 9న హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో సీపీఐ, సీపీఎంల ఉమ్మడి సభ జరుగుతుందని తెలిపారు.  

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)