Breaking News

జగిత్యాల కాంగ్రెస్‌లో కొత్త చర్చ.. జీవన్‌రెడ్డి ఫొటో ఎక్కడ?

Published on Sat, 07/06/2024 - 10:06

సాక్షి, జగిత్యాల: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష పార్టీల నేతలు హస్తం గూటికి చేరుతున్న నేపథ్యంలో పలు చోట్ల కాంగ్రెస్‌ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో కాంగ్రెస్‌ రాజకీయం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఫ్లెక్సీల వార్‌ ఇంకా కొనసాగుతోంది.

తాజాగా ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఫ్లెక్సీల్లో ఎక్కడా ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఫొటోలు లేకపోవడం స్థానికంగా హాట్‌ టాపిక్‌ అయ్యింది. కావాలనే జీవన్‌ రెడ్డి ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని కాంగ్రెస్‌ కార్యకర్తలు చెబుతున్నారు. ఇక.. మొన్న కూడా జీవన్‌ రెడ్డి ఫ్లెక్సీలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించిన విషయం తెలిసిందే.

మరోవైపు.. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో, రెండు వర్గాల మధ్య దూరం పెరుగుతోంది. ఈనేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్‌లో అంతర్గత పోరు పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. జగిత్యాలలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జీవన్‌ రెడ్డిని కావాలనే సైడ్‌ చేస్తున్నారా? అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 
 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)