Breaking News

తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ.. కొత్త నాయకుడెవరు?

Published on Sun, 06/29/2025 - 09:20

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే దానిపై పార్టీలో చర్చ నడుస్తోంది. బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ మధ్యే పోటీ ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక, జూలై ఒకటో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వెలువడనుంది.

కాగా, నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపికకి నోటిఫికేషన్ విడుదల కానుంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి యెండల లక్ష్మీనారాయణ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. రేపు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. జూలై ఒకటో తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన చేస్తారు. అయితే, తెలంగాణ బీజేపీ ప్రముఖంగా ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ మధ్యే పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరిని సారథ్య బాధ్యతలు వరించే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఈరోజు సాయంత్రం వరకు కొత్త అధ్యక్షుడి అభ్యర్థికి అధిష్టానం సంకేతాలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షులు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లతో ఓటరు జాబితా రెడీ అయ్యింది. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. నామినేషన్‌ వేయాలా వద్దా అనేదానిపై తర్వాత నిర్ణయించుకుంటానని రాజాసింగ్‌ తెలిపారు.

అయితే, అధ్యక్ష పదవి కోసం పార్టీలోని ముఖ్య నేతలంతా ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేశారు. కానీ సుదీర్ఘ కసరత్తు, అనేక సమీకరణాలు, వడపోతల తర్వాత.. చివరగా రేసులో ఇద్దరే ఇద్దరు నేతలు మిగిలారు. వాళ్లే ధర్మపురి అరవింద్‌, ఈటల రాజేందర్. అధ్యక్ష పదవిపై బయటికి చెప్పకపోయినప్పటికీ.. పార్టీలో ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తామని ఎంపీ లక్ష్మణ్‌ ప్రకటించారు.

ఈటల Vs అరవింద్‌..
బీజేపీ పార్టీకి విధేయుడిగా ధర్మపురి అరవింద్‌కు గుర్తింపు ఉంది. ఇక బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్‌షాకు సన్నిహితుడిగాను ఆయన ముద్ర వేసుకున్నారు. తెలంగాణలో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. సూటిగా విమర్శలు చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. మిగతా నేతల నుంచి పెద్దగా వ్యతిరేకత లేకపోవడం, బలమైన రాజకీయ నేపథ్యం ఆయనకు కలిసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు. ఇక ఈటల రాజేందర్‌ను తీసుకుంటే.. తెలంగాణలో బలమైన బీసీ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఉద్యమ నాయకుడిగా ప్రజాదరణ ఉంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు ఉండడంతో పాటు ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై అవగాహన ఉంది. పార్టీలో చేరినప్పుడు అధిష్టానం ఇచ్చిన హామీ కూడా ఆయనకు అనుకూలమైన అంశమే అంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో, కొత్త నాయకుడు ఎవరు అనే చర్చ మొదలైంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)