Breaking News

యనమల ఇంట రచ్చకు కారణం ఎవరు?

Published on Sun, 03/17/2024 - 19:06

తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల వ్యవహారం పలువురు నేతల ఇళ్ళల్లో కుంపట్లు రగిలిస్తోంది. టీడీపీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇంట్లోనే అన్నదమ్ముల మధ్య యుద్ధం మొదలైంది. ఇద్దరి మధ్యా టిక్కెట్ పోరు రచ్చకెక్కింది. దశాబ్దాలుగా వెంట నడిచిన తమ్ముడిని ఇప్పుడు అన్న దూరం చేసుకున్నాడు. ఇంతకి తుని సీటు కోరిందెవరు? దక్కించుకున్నది ఎవరు? యనమల ఇంట రచ్చకు కారణం ఎవరు?

తెలుగుదేశం పార్టీలో సూపర్ సీనియర్ నాయకుల్లో ఒకరైన యనమల రామకృష్ణుడు 2009లో ఓడిపోయాక ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ దశాబ్దాలుగా తన వెంట నడుస్తూ... నియోజకవర్గంలో పనులు చక్కబెట్టుకుడుతున్న యనమల కృష్ణుడికి సీటు ఇప్పించారు. రెండుసార్లు ఓడిపోయినా... మూడోసారి కూడా తనకు సీటు కావాలని కృష్ణుడు డిమాండ్ చేశారు. తనకు ఇవ్వకపోయినా..తన కొడుక్కి అయినా ఇవ్వాలని ఇటు అన్నను.. అటు టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. తన అన్న  కోసమే దశాబ్దాలుగా నియోజకవర్గంలో పనిచేస్తున్నందున తనకు కచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనని కృష్ణుడు ఒత్తిడి చేశారు. కాని పరిస్థితి రివర్స్‌ అయ్యింది.

చంద్రబాబు తర్వాత పార్టీలో తానే సుపీరియర్‌గా చలామణీ అవుతున్న యనమల రామకృష్ణుడు తన తమ్ముడి ప్రయత్నాలకు చెక్ పెట్టారు. ఈసారి తన కుమార్తె దివ్యకు కాకినాడు జిల్లా తుని అసెంబ్లీ సీటు ఇప్పించుకున్నారు. దీంతో యనమల ఇంట చిచ్చు రగిలింది. ఇదే సమయంలో దివ్య తన ఎన్నికల ప్రచారంలో బాబాయ్‌ కృష్ణుడు వర్గాన్ని దూరంగా ఉంచుతున్నారు. తనతో ప్రచారానికి రావొద్దని.. పార్టీ కార్యాలయంలోనే ఉంటూ..ఆఫీస్ పని చూసుకోవాలని కొద్ది రోజుల క్రిందట కృష్ణుడు ముఖ్య అనుచరుడైన శేషగిరికి యనమల కుమార్తె దివ్య స్పష్టం చేశారు. ఇలా తండ్రి..కూతుళ్ళు కృష్ణుడు.. అతని వర్గాన్ని దూరం పెట్టడంతో తునిలో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. 

టీడీపీ ఆవిర్భావం నుంచి ఆరుసార్లు తుని నుంచి గెలిచిన యనమల రామకృష్ణుడు 2009లో ఓడిపోయారు. అదే సమయంలో యనమల టీడీపీ రాష్ట్ర రాజకీయాల్లో..ప్రభుత్వ పదవుల్లో బిజీగా ఉండటంతో తునిలో పార్టీ తరపున అన్ని పనులూ ఆయన తమ్ముడు కృష్ణుడు చూసుకునేవారు. కార్యకర్తలకు..పార్టీకి మధ్య వారధిగా పనిచేశారు. అందుకే యనమల రెండుసార్లు సిఫార్సుచేసి సీటు ఇప్పించినా కృష్ణుడు ఓడిపోయారు. మూడోసారి తనకు కాకపోయినా తన వారసుడికి అయినా ఇవ్వాలని కోరినా..అన్న రామకృష్ణుడు చక్రం తిప్పి తన కుమార్తెకు ఇప్పించుకున్నారు. దీంతో కృష్ణుడు అవమానతో రగిలిపోతున్నారు.

కనీసం ప్రచారంలో కూడా తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇక అన్నకు..తెలుగుదేశం పార్టీకి కూడా గుడ్‌బై చెప్పాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తమ్ముడు దూరమైతే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దివ్యకు కచ్చితంగా నష్టమే అంటున్నాయి టీడీపీ వర్గాలు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)