Breaking News

హరీశ్‌రావు ఏమైనా డిప్యూటీ లీడరా?: కోమటిరెడ్డి

Published on Thu, 12/19/2024 - 11:05

ాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి, హరీష్‌రావు మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. హరీష్‌రావు ఏ హోదాలో ప్రశ్నలు అడుగుతున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో, పొలిటికల్‌ హీట్‌ నెలకొంది.

తెలంగాణలో ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం సభ ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలు చెప్పారు. అనంతరం, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందిస్తూ.. ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీదే మూసీ పాపం. కాళేశ్వరం జలాలను నల్లగొండకు అందించామన్నారు. దీంతో, కోమటిరెడ్డి.. హరీష్‌ వ్యాఖ్యలు మండిపడ్డారు.

 

 

అనంతరం, మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. అసలు హరీష్‌రావు ఎవరు?. డిప్యూటీ లీడర్‌నా? ఎమ్మెల్యేనా? ఏ హోదాలో మాట్లాడుతున్నారు?.  ఆయనకు అడిగే హక్కు లేదు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ఎక్కడున్నారు? తెలంగాణ ప్రజలను ఆయన అవమానపరచడమే అవుతుంది. నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో చెప్పాను. డబ్బున్న వాళ్లు హైదరాబాద్‌ వచ్చారు. లేని వాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకు నల్గొండ గురించి, నా గురించి మాట్లాడే హక్కు లేదు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ మూసీని పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం కూడా సభలో వీరద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. అంతకుముందు, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు. రైతు సమస్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేతలు ఎడ్ల బండ్లపై అసెంబ్లీకి వచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. 
  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)