Breaking News

అధికారం ఉంది కదా అని అడ్డంగా నడుస్తున్నారా?

Published on Wed, 05/28/2025 - 16:22

ఏపీలోని సినిమా థియేటర్లపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి.  అయితే ఇక్కడ ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే కక్ష సాధింపు చర్యలు కొనసాగడం గమనార్హం. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ థియేటర్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ టీడీపీ, జనసేనకు సంబంధించిన వారి థియేటర్లలోకి తనిఖీలు పేరుతో వెళ్లినా అక్కడ తూతూ మంత్రంగానే సోదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో అధికారులకు తనిఖీల ఆదేశాలు వెళ్లాయి.

మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ ల ధరల్లో గుత్తాధిపత్యం నడుస్తోందని, థియేటర్లలో పారిశుధ్యం లేకపోతే చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ నేపథ్యంలో తనిఖీలు షురూ చేశారు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్ల ధరలు థియేటర్లలో అధికంగా ఉన్నాయని, ఆ ధరలన్నీ నియంత్రించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడ పవన్‌ ద్వంద్వ వైఖరి అనేది ప్రధానంగా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

కూటమి నేతల థియేటర్లలో తనిఖీలు ఏవి?
డిప్యూటీ సీఎం కార్యాలయం ఆదేశాలు సరే కానీ, ఇక్కడ ఎవరి థియేటర్లని తనిఖీలు చేయాలనే ఆదేశాలు కూడా ఆఫ్ ద రికార్డు చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో టీ\డీపీ, జనసేన నేతల థియేటర్ల వైపు అదికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఒకవేళ ఆ థియేటర్లకు పొరపాటున వెళ్లినా  నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఒకేసారి ఫైర్, రెవెన్యూ, మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రధానంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ లీజుకు తీసుకున్న థియేటర్లలోనే తనిఖీలు ఎక్కువగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. మరి అప్పట్నుంచి థియేటర్లలో ఎందుకు తనిఖీలు చేపట్టలేదనేది ప్రధాన ప్రశ్న. థియేటర్లలో పారిశుధ్యం బాగా లేదని, తినుబండారాలు ధరలు ఎక్కువగా ఉన్నాయని, కొంతమంది గుత్తాధిపత్యం నడుస్తోందని ప్రధానంగా ప్రస్తుతం వినిపిస్తున్నమాట. అంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలోనే ఈ తనిఖీలు నిర్వహించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

బంద్ కుట్ర చేసింది జనసేన నేతని తేలినా..
సినిమా థియేటర్ల బంద్ డ్రామాకు తెరలేపింది జనసేన నేత అని తేలినా, థియేటర్లలో తనిఖీలు మాత్రం ఆగడం లేదు. కక్ష గట్టి థియేటర్లలో తనిఖీలు చేసేస్తున్నారు. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ థియేటర్లలో తనిఖీలు చేపట్టారు.  అయితే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల థియేటర్లలోనే తనిఖీలు చేస్తున్నారు. టీడీపీ నేతల చేతుల్లో అత్యధికంగా సినిమా థియేటర్లు ఉన్నప్పటికీ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు.  టీడీపీ, జనసేన నేతల థియేటర్లలో తనిఖీలు చేపట్టకుండా కొందరిని మాత్రమే టార్గెట్ చేసి తనిఖీలు చేస్తున్నారు.

సినిమా వాళ్ల పట్ల, సినిమా పట్ల ప్రభుత్వ జోక్యం ఏమిటని గతంలో ఊగిపోయిన పవన్.. ఇప్పుడు మాత్రం రగిలిపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకే ఇప్పుడు ‘రగులుతోంది మొగలి పొద’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నటుడు పవన్. అధికారం ఉంది కదా అని అడ్డంగా వెళ్లిపోయినా నడుస్తుందని మన డిప్యూటీ అనుకుంటున్నట్లు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)