రేపటి బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణ

Published on Mon, 01/20/2025 - 11:46

సాక్షి, నల్గొండ జిల్లా: నల్లొండలో బీఆర్ఎస్‌(BRS Party) రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు నల్గొండ(Nalgonda)లో కేటీఆర్‌(KTR) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే పోలీసులు మాత్రం ధర్నాకు నో చెప్పారు. పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్‌ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి నిరాకరణపై బీఆర్‌ఎస్‌ హైకోర్టును ఆశ్రయించింది.

ధర్నా కారణంగా క్లాక్‌ టవర్ సెంటర్‌లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందంటూ అనుమతి నిరాకరించారు. సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతుందని పోలీసులు తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం.. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నల్గొండలో బీఆర్‌ఎస్‌ రైతు మహాధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే. పట్టణ కేంద్రంలోని క్లాక్‌ టవర్‌ సెంటర్‌ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కానీ పోలీసులు.. ధర్నాకు అనుమతి నిరాకరించడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు

హామీలను అమలు చేయాలని అడగడం తప్పా?
రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమే ఇదంటూ ధ్వజమెత్తారు. కేటీఆర్ వస్తున్నారంటే రేవంత్ ప్రభుత్వం భయపడుతోంది. రేవంత్ ఇచ్చిన హామీల అమలును నిలదీయొద్దా?. హామీలను అమలు చేయాలని అడగడం తప్పా?’’ అంటూ లింగయ్య ప్రశ్నించారు.

ఇదీ చదవండి: కేసీఆర్, హరీశ్, ఈటలకు సమన్లు?

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)